నీడా!
చీకటి గదిలో....కాసేపు
కష్టాల బట్టలు విడిచేసి
కన్నీటి స్నానం చేసి
తిరిగి అవేబట్టలు తోడిగేస్కుని
తలవంచుకు వెళ్ళిపోయే నీడా!
'ఆత్మ'హత్య చేస్కున్నావా?
కడుపులో కాళ్ళు పెట్టుకుని
కలల దుప్పటీ కప్పుకుని
ఎక్కడ విసిరితే అక్కడేపడి నిద్రపోయే నీడా!
నిజంగానే 'ఆత్మ'ని హత్య చేస్కున్నావా?
నువ్వు 'నిజం'గా మారుతుంటే
'జీవాన్ని' పొందుతుంటే
కుక్క ఊరికే మొరిగిందని
భయపడి తాడులోకి తలదూర్చి
నీ గది నువ్వే మూసేస్కున్న నీడా!
అది- కుక్క
ఎంగిలి మెతుకుల కోసం
మిగిలిన బొమికెల కోసం
క్రూరజంతువుల కాళ్ళదగ్గర బతుకుతుంది
ఆ జంతువుల సంపదలు పెంచటానికి
నీ మీద మొరిగి విశ్వాసం ప్రకటించుకుంటుంది
బురదలోనే పోర్లాడుతుంది
నువ్వు నీడగా ఉన్నంతసేపూ
నిజంగా మరాలనుకున్నంత సేపూ
నిన్ను చూసి మొరుగుతూనే వుంటుంది
భయపడకు - చీకటికి కూడా.....
ధైర్యం దీపాన్నిపట్టుకుని
ఆశయాల బడితె చేతపట్టి
నిజానివై నీ ఆత్మని బ్రతికించు.
వంకర బుద్ధి సరిదిద్దితే
ఈ కుక్కే నీతో వస్తుంది
జంతువుల్ని వేటాడటంలో
నీకు తోడై నిలుస్తుంది.
కష్టాల బట్టలు విడిచేసి
కన్నీటి స్నానం చేసి
తిరిగి అవేబట్టలు తోడిగేస్కుని
తలవంచుకు వెళ్ళిపోయే నీడా!
'ఆత్మ'హత్య చేస్కున్నావా?
కడుపులో కాళ్ళు పెట్టుకుని
కలల దుప్పటీ కప్పుకుని
ఎక్కడ విసిరితే అక్కడేపడి నిద్రపోయే నీడా!
నిజంగానే 'ఆత్మ'ని హత్య చేస్కున్నావా?
నువ్వు 'నిజం'గా మారుతుంటే
'జీవాన్ని' పొందుతుంటే
కుక్క ఊరికే మొరిగిందని
భయపడి తాడులోకి తలదూర్చి
నీ గది నువ్వే మూసేస్కున్న నీడా!
అది- కుక్క
ఎంగిలి మెతుకుల కోసం
మిగిలిన బొమికెల కోసం
క్రూరజంతువుల కాళ్ళదగ్గర బతుకుతుంది
ఆ జంతువుల సంపదలు పెంచటానికి
నీ మీద మొరిగి విశ్వాసం ప్రకటించుకుంటుంది
బురదలోనే పోర్లాడుతుంది
నువ్వు నీడగా ఉన్నంతసేపూ
నిజంగా మరాలనుకున్నంత సేపూ
నిన్ను చూసి మొరుగుతూనే వుంటుంది
భయపడకు - చీకటికి కూడా.....
ధైర్యం దీపాన్నిపట్టుకుని
ఆశయాల బడితె చేతపట్టి
నిజానివై నీ ఆత్మని బ్రతికించు.
వంకర బుద్ధి సరిదిద్దితే
ఈ కుక్కే నీతో వస్తుంది
జంతువుల్ని వేటాడటంలో
నీకు తోడై నిలుస్తుంది.
Comments
Post a Comment