నీ కోసం.........
ఇక్కడ-
ఈ నిరీక్షణ గదిలో
నీ కోసమే నేను.
నా మనసు మాత్రం
నిరంతరం నీ దగ్గరే!
ఇక్కడ-
కొంటెగాలి
అమాయకమైన పువ్వుల్ని అల్లరి పెడుతూంది
ఈ పువ్వుల్ని నీ సిగలో దాయాలని ఉంది.
ఇక్కడ-
తుంటరి చంద్రుడు-
వెన్నెల నవ్వుల్ని రువ్వుతున్నాడు
ఈ వెన్నెల నీ సున్నిత నగ్నత్వంమీద పరవాలని ఉంది
ఇక్కడ-
నా పిచ్చి గుండె
నీ కోసం ప్రత్యేక రస్తా అయ్యింది.
ఇక నువ్వు రావడమే......
నీ పాదపూజకోసం ముద్దుల్ని భద్రపరిచాను.
ఆశని బట్వాడా చేసే
నీ కనుల కోసం......
నీ కోసం.........
ఇక్కడ-
ఈ నిరీక్షణ గదిలో...
నీ కోసమే... నేను
ఈ నిరీక్షణ గదిలో
నీ కోసమే నేను.
నా మనసు మాత్రం
నిరంతరం నీ దగ్గరే!
ఇక్కడ-
కొంటెగాలి
అమాయకమైన పువ్వుల్ని అల్లరి పెడుతూంది
ఈ పువ్వుల్ని నీ సిగలో దాయాలని ఉంది.
ఇక్కడ-
తుంటరి చంద్రుడు-
వెన్నెల నవ్వుల్ని రువ్వుతున్నాడు
ఈ వెన్నెల నీ సున్నిత నగ్నత్వంమీద పరవాలని ఉంది
ఇక్కడ-
నా పిచ్చి గుండె
నీ కోసం ప్రత్యేక రస్తా అయ్యింది.
ఇక నువ్వు రావడమే......
నీ పాదపూజకోసం ముద్దుల్ని భద్రపరిచాను.
ఆశని బట్వాడా చేసే
నీ కనుల కోసం......
నీ కోసం.........
ఇక్కడ-
ఈ నిరీక్షణ గదిలో...
నీ కోసమే... నేను
Comments
Post a Comment