ఋతువులు
కళ్ళలోని నీళ్ళతో
వత్సరమంతా మాకు
వర్షఋతువే!
కష్టం మర్చిపోటానికి
తాగిన కాసేపు పుట్టే వెర్రి ఆశే మాకు
శరదృతువు!
అవసరాలు తీర్చుకుని
ఆనక వదిలేస్తే - హేమంతం లోని
ఆరిపోయిన భోగిమంటలం మేం!
కడుపు కోసం
కష్టంతో జీవితమంతా మాకు
శిశిరమే!
ప్రోద్దంతా కష్టించి
ఆ కూలితో గంజైనా తాగితే అదే మాకు
వసంతం!
పని లేక, తిన తిండి లేక
ఎండిపోతున్న మాలో ప్రజ్వరిల్లుతోంది
గ్రీష్మం!
వత్సరమంతా మాకు
వర్షఋతువే!
కష్టం మర్చిపోటానికి
తాగిన కాసేపు పుట్టే వెర్రి ఆశే మాకు
శరదృతువు!
అవసరాలు తీర్చుకుని
ఆనక వదిలేస్తే - హేమంతం లోని
ఆరిపోయిన భోగిమంటలం మేం!
కడుపు కోసం
కష్టంతో జీవితమంతా మాకు
శిశిరమే!
ప్రోద్దంతా కష్టించి
ఆ కూలితో గంజైనా తాగితే అదే మాకు
వసంతం!
పని లేక, తిన తిండి లేక
ఎండిపోతున్న మాలో ప్రజ్వరిల్లుతోంది
గ్రీష్మం!
Ultimate
ReplyDelete