'?'

నా హృదయపు రస్తాపై
నువ్వు నడిచి వచ్చినపుడు
నీ కాలి అందెలు
నా చెవిలో గుసగుసలాడుతాయి
గలగల నవ్వుతాయి
తిన్నగా నడిచివచ్చి
నా గుండెలో కూర్చుంటావు
ఆనందపుటంబరంలో....
కలల హరివిల్లు మీద తిరుగుతుంటాన్నేను.
ఇంతలో....
నా మధురమైన ఊహలరెక్కలు విరిచేసి
నువ్వు కట్టుకుని ఎగిరిపోతావు-
నన్నొoటిగా ఈ చీకట్లో వదిలేసి.
అసలు-
నిన్ను నా గుండెలోకి రమ్మన్న దెవరు?
గుండెను ముక్కలుచేసి పొమ్మన్నదెవరు?

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........