చైతన్యం

అరచేతిలో పట్టుకుని
కాలద్దంటే మానుతుందా?
                         - రగులుతున్న నిప్పు.
గట్టుకు గండికొట్టి 
పోవద్దంటే ఆగుతుందా?
                         - ప్రవహించే నీరు.
గబ్బిలాలు రెక్కలడ్డంపెడితే
చీకటలా నిలుస్తుందా?
                         - ఉరకలెత్తే వెల్తురు ముందు.
నయవంచన సూత్రాలు చెప్పి
తిరగబడద్దంటే ఊరుకుంటుందా?
                         - ఎదురుతిరిగిన జనసమూహం.

నిప్పులా మండుతుంది
నీరులా పొంగుతుంది
వెలుగుని స్వంతం చేసుకుంటుంది.

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........