ప్రేమ ---(హైకూలు)
తొలిచూపులో
రగిలిన వలపు
రేపిన బాధ.
నీలోని నేను
నా మదినిండి నీవు
ఒక్కటై మనం.
కమ్మని కల
కల్లగా మిగిలితే
విషాచషకం
తియ్యని బాధ
నీకోసం నిరీక్షణం
అనుక్షణికం.
మోహన రూపం
మధుర దరహాసం
ప్రేమకు వరం
చూపుల వాడి
మనసు అలజడి
ప్రేమ రాపిడి.
ఒక జ్వలనం
ఒక కమ్మని కల
ఒకే విషాదం.
(జపాన్ సాహిత్యంలో వెలువడిన కవితా ప్రక్రియ 'హైకూ'. ఇది మూడు పంక్తుల్లో ఇమిడి పోతుంది. మొదటి పంక్తిలో, మూడో పంక్తిలో అయిదయిదు అక్షరాలుండాలి. రెండో పంక్తిలో ఎడక్షరాలు వుండాలి. మొత్తం పదిహేడు అక్షరాలుండాలి)

Comments
Post a Comment