చీకటికి చోటులేదిక్కడ
ఇవాళ అమావాస్య కదూ!
అయినా, చీకటికి చోటులేదిక్కడ
కాలే ప్రతి ఒత్తునుంచీ కాంతి పుడుతుంది
మండే ప్రతి గుండె మార్పు కోరుతుంది
వెలుగుతున్న కోటి దివ్వెలనుంచి
కోటి కాంతుల రస్తా కడుతుంది
రాలిన దీపపు కొడి
నవతకు ముందటి అలజడి
వెలుగుతున్న దీపపు వేడి
మనిషిలోని చైతన్యపు వాడి
రానున్న రేపునుంచి నవరాగం పలికించి
నవతను, మానవతను చిందించే
చైతన్యం మనిషిలో వెలుగుతుంది
ఇవాళ అమావాస్య కదూ!
అయినా, చీకటికి చోటులేదిక్కడ.
(దీపావళి కి రాసిన కవిత)
అయినా, చీకటికి చోటులేదిక్కడ
కాలే ప్రతి ఒత్తునుంచీ కాంతి పుడుతుంది
మండే ప్రతి గుండె మార్పు కోరుతుంది
వెలుగుతున్న కోటి దివ్వెలనుంచి
కోటి కాంతుల రస్తా కడుతుంది
రాలిన దీపపు కొడి
నవతకు ముందటి అలజడి
వెలుగుతున్న దీపపు వేడి
మనిషిలోని చైతన్యపు వాడి
రానున్న రేపునుంచి నవరాగం పలికించి
నవతను, మానవతను చిందించే
చైతన్యం మనిషిలో వెలుగుతుంది
ఇవాళ అమావాస్య కదూ!
అయినా, చీకటికి చోటులేదిక్కడ.
(దీపావళి కి రాసిన కవిత)
Comments
Post a Comment