వచ్చే కాలం వసంతమే!
సంపదలెన్నో సృష్టిస్తున్నా
విరామ మెరుగక కష్టిస్తున్నా
కర్మ భూమిలో కడుపుమంటతో
కుమిలే సోదర కార్మికులారా!
చిక్కటి చీకటి తప్పక చచ్చును
వేయిరేకులతొ వేకువ విచ్చును
పదండి పోదాం! పరాక్రమిద్దాం
ప్రజాశత్రువుల పని పట్టిద్దాం
అంతా ఒకటై అడుగేసామా
అడ్డుకునే దమ్మెవడికున్నదోయ్!
వెలుతురు కిరణం విచ్చుకుందిలే
వచ్చే కాలం వసంతమేనోయ్.
(మధుర గతి రగడ - ఛందస్సు అనుసరిస్తూ.......)
Comments
Post a Comment