రణరంగం

దేశమనే యుద్ధభూమిలో
పేలుతున్నాయి తుపాకి గుళ్ళు 
రాలుతున్నాయి బలయిన ఒళ్ళు
బ్లాక్ మార్కెట్ బాంబర్లతో
ధరల జట్ పైటర్లను వినువీదుల్లో విహారం
చేయిస్తున్నారు వ్యాపారపు కమాండర్లు
పన్నుల గుళ్ళతో 
ఫైరింగ్ చేస్తుంది ప్రభుత్వం
సోషలిజం టాంకర్లతో
కాలుస్తున్నారు ప్రతిపక్షపు హవాల్దార్లు
బాంబర్లకి బయపడి
జట్పైటర్లకి జడుసుకుని
టాంకర్లకి తలొగ్గి
పైరింగ్ లో పీనుగులయ్యి
ఆశల రుధిర దారలో
సామాన్య మానవుడనే సైనికుడు
"చస్తున్నాడు"

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........