అరవిరిసిన పువ్వు
ఇంకా మిగిలిన చీకట్లోంచి
పరుగెడుతుంది నా మనసు-
వెలుగులు చిందే చైతన్యానికి
చైతన్యపు భవితవ్యానికి.
వినిపించిందక్కడ
ఝుం, ఝూ ప్రభంజనపు ప్రళయ హేల.
అది, ఉరకలెత్తుతున్న ఏరు
చైతన్యపు హోరు
చిరిగిన ఇరుల తెరలనుంచి
సామాన్యుడి వదనంలో వెలిగింది
కల్మషం లేని నవ్వు
అరవిరిసిన పువ్వు.
పరుగెడుతుంది నా మనసు-
వెలుగులు చిందే చైతన్యానికి
చైతన్యపు భవితవ్యానికి.
వినిపించిందక్కడ
ఝుం, ఝూ ప్రభంజనపు ప్రళయ హేల.
అది, ఉరకలెత్తుతున్న ఏరు
చైతన్యపు హోరు
చిరిగిన ఇరుల తెరలనుంచి
సామాన్యుడి వదనంలో వెలిగింది
కల్మషం లేని నవ్వు
అరవిరిసిన పువ్వు.
Comments
Post a Comment