డీబీ పదాలు - 4

ఎదురు చూస్తాయి కళ్ళు
గుర్తుంచుకుంటాయి కాళ్ళు
అధిగమిస్తాయి ముళ్ళ దారిని
సంతోషంతో....సహనంతో.....

                            కొండ శిఖరం నుంచి నువ్వు అందించిన చెయ్యి
                            అందుకోలేక పడిపోతాను సఖీ!
                            కల అని తెలుసుకుని మళ్ళి
                            నిద్రలోకి జారిపోతాను - నీ కోసం!

ఆధరాన గులాభీలు
వదనాన గులాభీలు
శిగపాయలో గులాభీలు.
నీవు మొత్తం గులాభీ బాలవయి
వాడి ముళ్ళు గుండెలో దించుతావు!

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........