అందానికి బందీని

నాకు తెలుసు-
ఈ సౌందర్యం నన్ను బంధిస్తుందని
అందుకే.....
రాకూడదనుకున్నాను
కానీ.....వచ్చాను
సౌందర్యంతో బంధించబడ్డాను.
వంతెన మీది గడ్డి - నా వీపుని
సిగ్గుగా, స్నిగ్దంగా ముద్దెట్టుకుంది.
"వచ్చావా.....!"
చలిగాలి ఆప్యాయంగా పలకరించింది
వంతెన క్రింద ఒదిగి కూర్చున్న నది
ఒక్కసారి ఒళ్ళు విరిచుకుంది - 'చిల్..చిల్' అంటూ
ఆకాశంలో-
చంద్రుడు మబ్బుల రగ్గు ముసుగెట్టాడు
ఆకాశం చెట్టుమీoచి ఒక్కటోక్కటిగా
చుక్కల ఆకులు రాలిపోతున్నాయి- కనుపించనంత దూరం.
ఇంత బలమైన సౌందర్యపు సంకెళ్ళు....
అందుకే.....
రాకూడదనుకున్నాను
కానీ........వచ్చాను
అందంతో బంధించబడ్డాను.

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........