పాట మీద పేలిన తూటా!?

ఒక డప్పు మోత
ఒక కర్ర ఊత
బుజంమీద గొంగళి మోత
చిందేస్తే-
            జనం గుండెల్లో పరవళ్ళు తొక్కే పాట
            ఆ పాట మీద పేలిందోతూటా!
******

నిశ్శబ్ద నిశీధిలో రేపటి సూర్యుడి కోసం
విప్లవ గీతాలాలపిస్తున్న వెలుతురు పిట్టల్ని
గొంతునులిమి, కాలరాయాలని-
పదవుల పాదాలచెంత రాలిన
ఎంగిలి మెతుకులు కతికి
'కా....కా....' రావాలు చేస్తున్న కాకులు.

('ఖాఖీలు' అని నేను రాయలేదు.  మీరు అనుకుంటే మీ ఇష్టం)

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........