మనసులో మాట
నేను
చంద్రుడిమీద నడవలేదు-
ఎవరెస్ట్ పైకి ఎక్కనూలేదు.
నేను
ఆటగాడని కాదు
పోనీ, పాటగాడ్నికాదు
నిన్ను గురించిన ఊహల్లో ఉద్యోగం
అందమైన కలల ఆస్తి కలవాడ్ని
సఖీ! సామాన్య మానవుడ్ని.
అందుకే......
మనసులో మాట నీ ముందుంచాలంటే భయం
అయినా-
ఇక ఆగలేను.
"నీ మనసులో కాసింత చోటిచ్చి
ప్రపంచంలో అందరికంటే గొప్పవాడని చైమని"
నా మనసులో మాట చెప్పేస్తా!
ఎప్పుడో కాదు-
ఈ రాత్రికే....
నువ్వు నా కలలోకి రాగానే!
Comments
Post a Comment