ఒసేయ్

నా ఇంటి దీపమా-
నా కలల రూపమా-
సీతా, సావిత్రి,అనసూయ
నువ్వూ, నీలాంటి మరికొద్దిమంది
పతివ్రతలు పుట్టిన దేశం-
                       పవిత్ర దేశం మనది.
'నస్త్రీ  స్వాతంత్ర్యమర్హతి'
అన్నది మన (మను) ధర్మం.
అయినా-
మీకు పూర్తి స్వేశ్చయిచ్చాం.
అలాగని-
మగవాళ్ళతో సమానం అనుకోవద్దుసుమా!
నువ్వూ, నీ వానిటీ బాగూ
నువ్వు ఎక్కే బస్సూ, వెళ్ళే ఆపిసూ
అన్నీ మన (మనీ) కోసం తప్పవు.
అయినా, బస్సుల్లో భద్రం సుమా!
ఎక్కడెక్కడో తాకాలని తాపత్రయపడే వేళ్ళు
చూపుల శూలాలతో పొడుచుక తినే కళ్ళు.
కొంగు మరికాస్తభుజం చుట్టూ తిప్పుకో
మగవాళ్ళతో మాట్లాడటం మహాపాపం - తెలుసుకో....
సీతా, సావిత్రి,అనసూయ
నువ్వూ, నీలాంటి మరికొద్దిమంది
పతివ్రతలు పుట్టిన దేశం-
                       పవిత్ర దేశం మనది.
"ఏవిటీ....!?"
నేను పరాయి స్త్రీలతో మాట్లాడుతున్నానంటావా?
నేనంటే - ఏదో సరదాగా
అవసరంలో వాళ్లకి సాయంగా-
అందరూ నాలా వుండరు సుమా!
కేవలం డబ్బుకోసమే  నిన్ను
బయటకు పంపుతున్నానని బ్రమపడకు
ఏదో, నీకు కాలక్షేపం
నాకు వెసులుబాటు.
అయినా, నీవు సంపాదించే జీతంలో
కాస్తో, కూస్తో నీ ఖర్చులకిచ్చే సంస్కారం నాది
మంచివాణ్ణి, నేను చెప్తున్నా
పరాయి మొగవాడ్ని దూరంగా ఉంచు.
సీతా, సావిత్రి,అనసూయ
నువ్వూ, నీలాంటి మరికొద్దిమంది
పతివ్రతలు పుట్టిన దేశం-
                       పవిత్ర దేశం మనది.
ఎంత బస్సులు బంధయితేమాత్రం
ఎవడి స్కూటర్ మీదో రావాలా?
ఇలా అన్నానని - నేను 'అనుమానం' మనిషినని
అనుకోవద్దు సుమా!
వెదవలోకం కోడై కూస్తుంది కదాని
నీ మంచి కోసం మంచి మంచిగా చెప్తున్నా!
నే చెప్పింది వినడం నీ ధర్మం
సీతా, సావిత్రి,అనసూయ
నువ్వూ, నీలాంటి మరికొద్దిమంది
పతివ్రతలు పుట్టిన దేశం-
                       పవిత్ర దేశం మనది.

(మేరివాల్టన్ క్రాఫ్ట్ రాసిన 'The indication of the rights of women'
తో స్త్రీవాద సాహిత్యం {feminisam} మొదలయింది)




Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........