కర్తవ్యం
చుట్టూ నల్లటి ఆకారాలు-
వికారంగా అవి చేస్తున్న అట్ట్ హాసాలు
నల్లబజారు గారడిలో మరీ నల్లబడ్డ నోట్లు
చుట్టూ చేరి బెదిరించాయి - కలల్లో.....
నిన్నటివరకు అవే కలలతో
అలమటించి పోయిందీ హృదయం
ఇంతలో.....
ఒక అమృతహస్తం కనిపించిందీ ఉదయం
నుదిటిమీద చల్లటి గాలి ఊది
పాడు కలల్ని, పీడ కలతల్ని దూరంచేసింది
సామాన్యుడి నుదుటిరాత మారింది
యువకులు చేయవలసిందే మిగిలింది
కట్నాలు రూపుమాపుతాం అని ప్రతినపూని
కులమత బేదాలు లేవంటూ సాగిపోయి
ప్రతివాడూ పదిమందికుపాదినిచ్చే
పరిశ్రమలు స్థాపిస్తే ....
ఆపై సిద్దిస్తుంధీ 'బాపూ' కలల రాజ్యం.
వికారంగా అవి చేస్తున్న అట్ట్ హాసాలు
నల్లబజారు గారడిలో మరీ నల్లబడ్డ నోట్లు
చుట్టూ చేరి బెదిరించాయి - కలల్లో.....
నిన్నటివరకు అవే కలలతో
అలమటించి పోయిందీ హృదయం
ఇంతలో.....
ఒక అమృతహస్తం కనిపించిందీ ఉదయం
నుదిటిమీద చల్లటి గాలి ఊది
పాడు కలల్ని, పీడ కలతల్ని దూరంచేసింది
సామాన్యుడి నుదుటిరాత మారింది
యువకులు చేయవలసిందే మిగిలింది
కట్నాలు రూపుమాపుతాం అని ప్రతినపూని
కులమత బేదాలు లేవంటూ సాగిపోయి
ప్రతివాడూ పదిమందికుపాదినిచ్చే
పరిశ్రమలు స్థాపిస్తే ....
ఆపై సిద్దిస్తుంధీ 'బాపూ' కలల రాజ్యం.
Comments
Post a Comment