కరిగి కాగితంపై.......
నా గుండెలో
గూడుకట్టుకున్న ఊహల గువ్వలు
సుతారంగా నా వేళ్ళను మీటుతూ
'సిరా' గా మారి కాగితం మీద చరిస్తున్నాయి
"ప్రియతమ్" అన్న నీ పిలుపు
కొండ గుండెలో పదేపదే విన్పించింది
అప్పుడే కదూ....!
మనిద్దరం కొండ ఒడిలో.....
ప్రపంచంనుంచి పారిపోయాం
ఆ గుర్తు కూడా కరిగి కాగితంపై కూచుంది
నీకు గుర్తుందా.......?
నా కళ్ళు నిన్ను తాగుతున్నప్పుడు-
నా గొంతు నిన్ను చూస్తున్నప్పుడు-
నీ బుగ్గమీద పూచిన కుంకుమ పువ్వుని
ముద్దులో భద్రపరిచా!
ఆ గుర్తు కూడా కరిగి కాగితంపై కూచుంది
ఇప్పుడు.....
నాలో నేను చూసుకున్నాను
ఏది.....?
నా గుండెను గాలం వేసిలాగిన
సౌందర్యానుభూతి
నన్ను ప్రపంచపు చివరిమెట్టు ఎక్కించిన
దివ్య స్మృతి......?
అన్నీ అలానే.......
కరిగి కాగితంపై.......
గూడుకట్టుకున్న ఊహల గువ్వలు
సుతారంగా నా వేళ్ళను మీటుతూ
'సిరా' గా మారి కాగితం మీద చరిస్తున్నాయి
"ప్రియతమ్" అన్న నీ పిలుపు
కొండ గుండెలో పదేపదే విన్పించింది
అప్పుడే కదూ....!
మనిద్దరం కొండ ఒడిలో.....
ప్రపంచంనుంచి పారిపోయాం
ఆ గుర్తు కూడా కరిగి కాగితంపై కూచుంది
నీకు గుర్తుందా.......?
నా కళ్ళు నిన్ను తాగుతున్నప్పుడు-
నా గొంతు నిన్ను చూస్తున్నప్పుడు-
నీ బుగ్గమీద పూచిన కుంకుమ పువ్వుని
ముద్దులో భద్రపరిచా!
ఆ గుర్తు కూడా కరిగి కాగితంపై కూచుంది
ఇప్పుడు.....
నాలో నేను చూసుకున్నాను
ఏది.....?
నా గుండెను గాలం వేసిలాగిన
సౌందర్యానుభూతి
నన్ను ప్రపంచపు చివరిమెట్టు ఎక్కించిన
దివ్య స్మృతి......?
అన్నీ అలానే.......
కరిగి కాగితంపై.......
Comments
Post a Comment