ఊహతో ఊసులు
వాసన లేని పువ్వుల్ని
ఆకాశంలో చిందరవందరగా విసిరేసి
వెన్నెల అలిగి పడుకుంది
ఓదార్చటం తెలీని చంద్రుడు
ముఖం ముడుచుక్కుర్చున్నాడు
కొండవాగు కూనిరాగాలు తీస్తూ
క్రిందకి పరుగులు తీస్తోంది
చెట్టుమీది కోయిలమ్మ
గొంతు విప్పి పాడుతుంది
అందరి మధ్యా ఒంటరిగా......
పచ్చిక పరచిన తివాచిపై
"నేనొక్కడినే......నే నోక్కడినీ"
-అని మదన పడుతుంటే.......
"పిచ్చివాడా! నేను లేనూ...
నీ గుండె అంతా నిండి" -
అంటూ-
ఊహ ఊసులాడుతుంది.
ఆకాశంలో చిందరవందరగా విసిరేసి
వెన్నెల అలిగి పడుకుంది
ఓదార్చటం తెలీని చంద్రుడు
ముఖం ముడుచుక్కుర్చున్నాడు
కొండవాగు కూనిరాగాలు తీస్తూ
క్రిందకి పరుగులు తీస్తోంది
చెట్టుమీది కోయిలమ్మ
గొంతు విప్పి పాడుతుంది
అందరి మధ్యా ఒంటరిగా......
పచ్చిక పరచిన తివాచిపై
"నేనొక్కడినే......నే నోక్కడినీ"
-అని మదన పడుతుంటే.......
"పిచ్చివాడా! నేను లేనూ...
నీ గుండె అంతా నిండి" -
అంటూ-
ఊహ ఊసులాడుతుంది.
Comments
Post a Comment