ప్రవాహాల్లో.........నేను

నిశ్శబ్దం
నిరంకుశంగా 
పరిపాలిస్తున్న నా గదిలో........
ఆలోచనలు వర్షిస్తాయి
నాలో దూరికూచున్న
నన్నే ముంచెత్తి, ఆపై........
గుండె కొండల్లోంచి  
సెలయేళ్లయి ప్రవహిస్తాయి
ఎన్నెన్ని అనుభవాల జ్ఞాపకాలు
నన్నోరుసుకుంటూ సాగుతాయో.....
         ********
             నేను -
             మయురాన్నౌతాను
             నా ప్రవాహాలతో ఆనందనృత్యం చేయించటానికి
             హరివిల్లున్నౌతాను
             నా ప్రవాహాలతో రాగాల రంగులు పలికించటానికి
             కపోతాన్నౌతాను
             నా ప్రవాహాలను స్వేశ్చసంకేతాలుగా నిలిపేందుకు.
అన్నిటికంటే ముందు
             సూర్యుడ్ని అవుతాను
             నా ప్రవాహాల కిరణాలతో
             చీకట్లని చీల్చటానికి.............. 

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........