డీబీ పదాలు - 3
సఖీ! రాత్రంతా నీ చూపుల్లా
దూరంనుంచి తొంగి చూసే
చుక్కలకికూడా నేనంటే అలుసే
తెల్లవారకముందే తప్పుకుంటాయి.
దూరంగా కలిసే నింగీ,నేలా
మనిద్దరం అంటే - ఆ కలయిక బ్రమంటావ్
సఖీ! నిరంతరం నేల గుండెల్లో
నింగి ప్రతిబింబం చూసుకుంటూంది చాలదూ!
నా కంటి రెటీనా వెనుక ఆర్ట్ గేలరీ లో...
కళ్ళు మూసినా, తెరిచినా కనుపించే బొమ్మలు
కలల చివరవరకూ పేర్చుకున్నాను.
తీరాచూస్తే........అన్నీ నీ బొమ్మలే!
సఖీ! చలిరేపిన ఆకలి
కోరుతూంది నీ కౌగిలి
వేడెక్కిన శరీరం
కావాలంది నీ అధరామృతం.
నీ ప్రేమ వికెట్ కోసం
నా గుండె బౌల్ చేస్తా! కాని.....
సఖీ! ఒక్క చూపు దెబ్బతో విసిరేస్తావ్
నన్ను పెవిలియన్ ఎండ్ కి.
దూరంనుంచి తొంగి చూసే
చుక్కలకికూడా నేనంటే అలుసే
తెల్లవారకముందే తప్పుకుంటాయి.
దూరంగా కలిసే నింగీ,నేలా
మనిద్దరం అంటే - ఆ కలయిక బ్రమంటావ్
సఖీ! నిరంతరం నేల గుండెల్లో
నింగి ప్రతిబింబం చూసుకుంటూంది చాలదూ!
నా కంటి రెటీనా వెనుక ఆర్ట్ గేలరీ లో...
కళ్ళు మూసినా, తెరిచినా కనుపించే బొమ్మలు
కలల చివరవరకూ పేర్చుకున్నాను.
తీరాచూస్తే........అన్నీ నీ బొమ్మలే!
సఖీ! చలిరేపిన ఆకలి
కోరుతూంది నీ కౌగిలి
వేడెక్కిన శరీరం
కావాలంది నీ అధరామృతం.
నీ ప్రేమ వికెట్ కోసం
నా గుండె బౌల్ చేస్తా! కాని.....
సఖీ! ఒక్క చూపు దెబ్బతో విసిరేస్తావ్
నన్ను పెవిలియన్ ఎండ్ కి.
Comments
Post a Comment