డీబీ పదాలు - 1
చీకటి వాకిటిలోనే
సుఖాలు దొరుకుతాయి
మత్తు ద్రవాల్లోనే
కష్టాలు కరుగుతాయి.
వెలది చూపులు
వాడి వేడి బాణాలు
గాయం అయ్యిందంటే
అవ్వదూ మరి గుండె.
నిన్ను ప్రేమిస్తూ
నన్ను నేనే మర్చిపోతాను
నువ్వు తిరస్కరిస్తే
జీవితాన్నే మర్చిపోతాను
చెలి చూపు తూపై
గుండె గాయం చేస్తుంది
చెలి వలపు మందై
గాయాన్ని మాన్పుతుంది
వెన్నెలకు వేడికోరిక
రగల్చడమే తెలుసు
కఠిన చిత్తురాలికి విరహంతో
చంపటమే వలపు.
సుఖాలు దొరుకుతాయి
మత్తు ద్రవాల్లోనే
కష్టాలు కరుగుతాయి.
వెలది చూపులు
వాడి వేడి బాణాలు
గాయం అయ్యిందంటే
అవ్వదూ మరి గుండె.
నిన్ను ప్రేమిస్తూ
నన్ను నేనే మర్చిపోతాను
నువ్వు తిరస్కరిస్తే
జీవితాన్నే మర్చిపోతాను
చెలి చూపు తూపై
గుండె గాయం చేస్తుంది
చెలి వలపు మందై
గాయాన్ని మాన్పుతుంది
వెన్నెలకు వేడికోరిక
రగల్చడమే తెలుసు
కఠిన చిత్తురాలికి విరహంతో
చంపటమే వలపు.
Comments
Post a Comment