శూన్యాన్ని తింటూ కూర్చో.......
నన్ను నేను తెలుసుకోటానికి
ఆందోళనా రాగంలో......నేను!
నా అక్షరాలు కుక్షిలో నింపుకుని
లోకం కళ్ళతో గుసగుసలాడుతానంటున్న
కాగితం నా ఎదర!
భాష రాని వాణ్ణి
భావాలసలె లేనివాణ్ణి.
అనుభవం సముద్రంలో
కన్నీటి ముద్రలో-
నేను ఈదాను ......కాదనటం లేదు.
ఇంకా.......
కనపడుతున్నంత మేరా ఈదాలి-
వినబడుతున్నంత వినాలి.
ఈ రాగాన్ని పూర్తి చేయాలి
నా మనసులో......
నిశిలో......
చైతన్యం వెలిగించాలి.
అప్పుడుగానీ-
అక్షరాల్ని కనలేను, అనలేను...
అందాకా కాగితం!
నువ్వు ఆ శూన్యాన్ని తింటూ కూర్చో.......
దైన్యంగా కాదు - ధైర్యంగా....
చైతన్యం వెలుగుతుందన్న
ఆశతో.........హాసంతో
ఆందోళనా రాగంలో......నేను!
నా అక్షరాలు కుక్షిలో నింపుకుని
లోకం కళ్ళతో గుసగుసలాడుతానంటున్న
కాగితం నా ఎదర!
భాష రాని వాణ్ణి
భావాలసలె లేనివాణ్ణి.
అనుభవం సముద్రంలో
కన్నీటి ముద్రలో-
నేను ఈదాను ......కాదనటం లేదు.
ఇంకా.......
కనపడుతున్నంత మేరా ఈదాలి-
వినబడుతున్నంత వినాలి.
ఈ రాగాన్ని పూర్తి చేయాలి
నా మనసులో......
నిశిలో......
చైతన్యం వెలిగించాలి.
అప్పుడుగానీ-
అక్షరాల్ని కనలేను, అనలేను...
అందాకా కాగితం!
నువ్వు ఆ శూన్యాన్ని తింటూ కూర్చో.......
దైన్యంగా కాదు - ధైర్యంగా....
చైతన్యం వెలుగుతుందన్న
ఆశతో.........హాసంతో
Comments
Post a Comment