కూనలమ్మ పదాలు.

అంత్యప్రాస్లతోటి
కవితలను చెప్పేటి
ఆరుద్రయే మేటి
ఓ కూనలమ్మా!

అతివ అందాలందు
కోరుచుందును పొందు
తెలివి తేటలు బంధు
ఓ కూనలమ్మా!

సాముల అసలురంగు
కొట్టుచుండును బంగు
చెప్పుచుండును రాంగు
ఓ కూనలమ్మా!

క్లాసులంటే వేష్టు
ఎందుకొచ్చిన రొష్టు
ఆటలుంటే బెష్టు
ఓ కూనలమ్మా!

అందమెందుకు అనుడు
కట్నం వచ్చేటపుడు
డబ్బు చేదా ఇపుడు
ఓ కూనలమ్మా!

ఒక్క నవ్వు తోటి
పర్సు అంతా లూటి
చేయులే ఈ బ్యూటి
ఓ కూనలమ్మా!

ఆరుద్రనే చదివి
ఆ పద్ధతి పొదివి
రాసాడు ఈ కవి
ఓ కూనలమ్మా!

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........