రేపు కోసం కాపు.

ఏమిటిరా ఈ బ్రతుకు
విషవృక్షపు నీడలో-
ఎందాకా ఈ సహనం-
మాడుతున్న డొక్కలతో.......
   పాతరాతి యుగాలవాళ్ళు
   కొత్తరాతి పలకల క్రింద
   కప్పెడుతున్నారు నీతి.
నిప్పులాంటి నిజాలు నన్ను
నిలువునా దహిస్తున్నాయ్
పరిస్థితుల సత్యాలు నన్ను 
పగపట్టి కాతెస్తున్నాయ్.
    విరిగిన స్వప్నాలు నన్ను
    తోస్తున్నవి  వాస్తవానికి
    ఎగిసెగిసిపడే ఆశలు
    చుపుతున్నాయ్ వెలుగుబాట.
మండుతున్నాయ్ గుండెలు
సహనానికి శాపంలా-
విచుకున్నాయ్ కళ్ళు
కాలానికి మార్పుగా!
    రేపు నిలిచి వున్నది
    మంచికి మరో పేరుగా....
    కాపు కాస్తాను నేను
    దూరంగా అగుపడే ఆ రేపుకోసం....

('కొత్త పాళీలు' కవితా సంకలనం లో ప్రచురితం)

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........