నేడు.....రేపు
నిన్నెవరో ఏదో చేసారని నిందిస్తూ
పారేసుకున్న సమయం కోసం
వెనుతిరిగి చూస్తూ
వెక్కి వెక్కి ఏడుస్తావెందుకు?
'రేపు' ఉరకలు వేస్తూ వస్తుంది
'నేడు' గతంలోకి జారిపోతుంది
నువ్వింకా ఇక్కడే ఉంటే లాభం లేదు
నిన్నటి అనుభవాల ప్రక్షాళనంతో
నేడు సమతా విత్తులు నాటు
రేపటికవి మహావ్రుక్షాలై
మనకందించే మానవతా నీడల్లో
మనగలిగే భాగ్యం పొందు.
పారేసుకున్న సమయం కోసం
వెనుతిరిగి చూస్తూ
వెక్కి వెక్కి ఏడుస్తావెందుకు?
'రేపు' ఉరకలు వేస్తూ వస్తుంది
'నేడు' గతంలోకి జారిపోతుంది
నువ్వింకా ఇక్కడే ఉంటే లాభం లేదు
నిన్నటి అనుభవాల ప్రక్షాళనంతో
నేడు సమతా విత్తులు నాటు
రేపటికవి మహావ్రుక్షాలై
మనకందించే మానవతా నీడల్లో
మనగలిగే భాగ్యం పొందు.
Comments
Post a Comment