అంతరాత్మని బంధించేస్తా......
"రాతలూ, మాటలే కాదు
చేతలూ కావాలి" --అంటూ
ఎదురుగా వచ్చి కూర్చుంటుంది - అంతరాత్మ!
అర్దంలేని ఆదర్శాలని వల్లిస్తుంది
దానికేం తెలుసు...?
ఇక్కడ-
ఆదర్శాలను గురించి చెప్పేవాడ్ని, రాసేవాడ్ని
ఆకాశానికి ఎత్తుతారని -
ఆచరిన్చేవాన్ని
అమాయకుడు అంటారని
అదఃపాతాళానికి తోక్కేస్తారని-
అందుకే......
అంతరాత్మని మత్తులో బంధించేసి
మరో ఆకలి కవిత రాసుకొస్తాను
'మీ పొగడ్తల చప్పట్ల కోసం...
కీర్తి ప్రతిష్టల కోసం......
చేతలూ కావాలి" --అంటూ
ఎదురుగా వచ్చి కూర్చుంటుంది - అంతరాత్మ!
అర్దంలేని ఆదర్శాలని వల్లిస్తుంది
దానికేం తెలుసు...?
ఇక్కడ-
ఆదర్శాలను గురించి చెప్పేవాడ్ని, రాసేవాడ్ని
ఆకాశానికి ఎత్తుతారని -
ఆచరిన్చేవాన్ని
అమాయకుడు అంటారని
అదఃపాతాళానికి తోక్కేస్తారని-
అందుకే......
అంతరాత్మని మత్తులో బంధించేసి
మరో ఆకలి కవిత రాసుకొస్తాను
'మీ పొగడ్తల చప్పట్ల కోసం...
కీర్తి ప్రతిష్టల కోసం......
Comments
Post a Comment