ప్లస్
నా గదిలో....
ఆలోచనలకు పదును పెడుతుంటాను
గది చుట్టూ చీకటి.....
మినుకు మినుకు మంటున్న దీపం -
గదిలో నాకు ధైర్యం
కిటికీలలోంచి హోరుగాలి
భయంకర నిజాలతో గదంతా నిమ్పెస్తుంటే....
గదిలో మాత్రం దీపం ఆరకుండా కాపాడుకుంటాను.
బ్రెయిన్లో నిశ్శబ్దo పగుళ్ళనుంచి శబ్దాలు....
తూర్పున చీకటిని చీలుస్తూ -
కిరణాల కత్తుల్తో సూర్యుడు!
ఇంకెంత సేపు -
గదిలో దీపం ఆరకుండా
ఆలోచనలకు పదును పెడతాను.
ఆలోచనలకు పదును పెడుతుంటాను
గది చుట్టూ చీకటి.....
మినుకు మినుకు మంటున్న దీపం -
గదిలో నాకు ధైర్యం
కిటికీలలోంచి హోరుగాలి
భయంకర నిజాలతో గదంతా నిమ్పెస్తుంటే....
గదిలో మాత్రం దీపం ఆరకుండా కాపాడుకుంటాను.
బ్రెయిన్లో నిశ్శబ్దo పగుళ్ళనుంచి శబ్దాలు....
తూర్పున చీకటిని చీలుస్తూ -
కిరణాల కత్తుల్తో సూర్యుడు!
ఇంకెంత సేపు -
గదిలో దీపం ఆరకుండా
ఆలోచనలకు పదును పెడతాను.
Comments
Post a Comment