రాక్షసీ

రాక్షసీ !
నాలోనే కూర్చుని ఎందుకలా కేకలేస్తావ్?
మేమంటే నీకు ప్రేమ ఉండచ్చు......
మాకు మాత్రం లేదు-
మమ్మల్నోదిలి పో .......ప్లీజ్!

అటు చూడు........
సీతాకోకచిలుకలన్నీ
జట్లు జట్లు గా పరుగులేడుతున్నాయి......
తోటలోని పూలతో ఆనందం పంచుకోటానికి
నేనూ వెళ్దామంటే---
నువ్వూ..........నా కూడా.......
అందుకే నువ్వంటే నాకు కోపం!

చంద్రుడ్ని జోకోడుతున్నమబ్బులంటే
వెన్నెలకీ కోపమే......
అందుకే చూడు ఎలా ముదుచుక్కూర్చున్దొ!

నాలోని నిన్ను సమాధి చెయ్యాలంటే
నిన్ను చంపలేని నిస్సహాయతలో.........
నన్ను నేనే చంపుకోవాలి,
అసలు నువ్వంటూలేకుండా ఎవరైనా చేస్తే......
వాడిని అంటాను---భగవంతుడని.

ఈ గాలి చూడు.....
వేణువంతా నిండి రాగమై రావాలన్న ఉబలాటం.....
ఈ కళ్ళు చూడు .........
మనసు కేన్వాస్ మీద ప్రపంచాన్నంతా...
ఒక్కసారే ముద్రించేయలన్న ఉబలాటం!

నువ్వు ---అన్నిటికీ అడ్డే!
అబ్బ! రాక్షసీ !.......
ఆకలీ.......!
నన్నొదిలి పోవే......
మళ్ళీ ఎప్పుడూ రాలేనంత దూరం
పో........ప్లీజ్.....
రాక్షసీ !.........
ఆకలీ.........!



Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........