చీకట్లో....నిశ్శబ్దం వాకిట్లో.......
నిశ్శబ్దం........నిశ్శబ్దం.........
నేల చివళ్ళ నుంచి
నింగి అంచుల వరకూ-
నిశ్శబ్దం........నిశ్శబ్దం.........
చీకటి ముసుగేసుకున్న
నిశ్శబ్దం వాకిట్లో.........
లో..........
స్వప్నాలు విరిగుతున్న చప్పుడు
అతకని బతుకుల నిట్టూర్పులు
నేపద్యంలో-
ఎక్కడో స్మశానంలో ఓ నక్క
ఇక్కడే వీధిలో ఓ గజ్జికుక్క
తెరవాలని నాటక రంగంలో........
వెలగని వీధిలైటు క్రింద
చవక రకం పౌడరు నీడల బేరాలు..
గొంతు దాటని బాధల బరువులు
తడి ఆరని కన్నీటి ఆవిర్లు...
"ఏమిటది....?" - అడగొద్దు
నీడలు నిజాలు చెప్పవు
పగిలిన పెదాలమీద కాగితం పూలు పూస్తాయి
జానెడు కడుపు
శరీరానికి ఖరీదు కడుతుంది
గుప్పెడు మనసు
ఆకలితో ఉరేసుకుంటుంది.
అన్నీ, ఆ చీకట్లోనే..........
అన్నీ, ఆ నిశ్శబ్దంలోనే ......
చీకట్లో.....నిశ్శబ్దం వాకిట్లో
ఇంకా అలానే-
స్వప్నాలు విరుగుతున్న చప్పుడు
అతకని బ్రతుకుల నిట్టూర్పులు.
నేల చివళ్ళ నుంచి
నింగి అంచుల వరకూ-
నిశ్శబ్దం........నిశ్శబ్దం.........
చీకటి ముసుగేసుకున్న
నిశ్శబ్దం వాకిట్లో.........
లో..........
స్వప్నాలు విరిగుతున్న చప్పుడు
అతకని బతుకుల నిట్టూర్పులు
నేపద్యంలో-
ఎక్కడో స్మశానంలో ఓ నక్క
ఇక్కడే వీధిలో ఓ గజ్జికుక్క
తెరవాలని నాటక రంగంలో........
వెలగని వీధిలైటు క్రింద
చవక రకం పౌడరు నీడల బేరాలు..
గొంతు దాటని బాధల బరువులు
తడి ఆరని కన్నీటి ఆవిర్లు...
"ఏమిటది....?" - అడగొద్దు
నీడలు నిజాలు చెప్పవు
పగిలిన పెదాలమీద కాగితం పూలు పూస్తాయి
జానెడు కడుపు
శరీరానికి ఖరీదు కడుతుంది
గుప్పెడు మనసు
ఆకలితో ఉరేసుకుంటుంది.
అన్నీ, ఆ చీకట్లోనే..........
అన్నీ, ఆ నిశ్శబ్దంలోనే ......
చీకట్లో.....నిశ్శబ్దం వాకిట్లో
ఇంకా అలానే-
స్వప్నాలు విరుగుతున్న చప్పుడు
అతకని బ్రతుకుల నిట్టూర్పులు.
Comments
Post a Comment