ప్రయాణం

కాలువ మురికి నీటితో మెల్లగా సాగుతోంది
ప్రక్కనే గతుకుల రోడ్డుపై....
బస్సు బ్రహ్మాండంగా సాగిపోతోంది.
కాల్వ గట్టున స్త్రీలు బట్టలు ఉతుకుతున్నారు
బస్సోళ్ళు ప్రయాణికుల పేగులు ఉతుకుతున్నారు
కాలవలో చేప వలలో చిక్కినట్టు
బస్సులోకి ఎక్కిందో పదారేళ్ళ పడుచు-
అందరి కళ్ళు ఆవైపు ఆభగా చూసాయి!
అంతలో ఓ గతుకు........
జాకిటు పరిసీలిస్థున్న తాతగారి గుండు ట౦గుమంది-
మనీపర్సు బాబుగారి గుండె జల్లుమంది
వెనుక సీటు చింకిచొక్కవాన్ని'దొంగ...దొంగ' అన్నారు.
వాడి విపు హోరుమంది
రేవలాన్ సెంటు పూసిన టెరిలిన్చొక్కాదొర
కొట్టేసిన పర్సు తల్చుకుని నవ్వుకున్నాడు
బస్సు - గతుకుల రోడ్లలో
గమ్మత్తుగా, మత్తుగా సాగిపోతోంది.




Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........