మనిషి!
జీవితపు చషకం నిండా
కటిక విషంలాంటి చీకటి-
చీకటిలో.....
కలల వలల అంచులు పట్టుకు వ్రేల్లాడుతూ.....
మనిషి!
కృత్రిమత్వపు పేస్ పౌడర్
జిలుగులు ప్రదర్శిస్తూ-
మనసులోని విషానికి
పెదాలచివర తియ్యటి పలుకుల పూతపూస్తూ.....
మనిషి!
విరిగిపోయిన రికార్డ్ ప్లేటుమీద
అరిగిపోయిన పిన్ను-
అరనిముషం నిశ్శబ్దoలో.....
అనేకానేక శబ్దాలు.
కసిని, కుళ్ళుని హెచ్చవేసి
అభిమానాన్ని, అనురాగాన్ని మైనస్ చేసి
మాయని, మోసాన్ని ప్లస్ చేస్తే-
దాని పేరు 'జీవితం' అని
తన నెత్తిన తనే కాళ్ళు పెట్టి,
తన చుట్టూ చక్కటి గోరి కట్టుకుంటూ.....
మనిషి!
తీగతెగిన వీణ మీద
సరిగమలు సాధన చేస్తూ
కలల వలల అంచులు పట్టుకు వ్రేళ్ళాడుతూ.....
మనిషి!
కటిక విషంలాంటి చీకటి-
చీకటిలో.....
కలల వలల అంచులు పట్టుకు వ్రేల్లాడుతూ.....
మనిషి!
కృత్రిమత్వపు పేస్ పౌడర్
జిలుగులు ప్రదర్శిస్తూ-
మనసులోని విషానికి
పెదాలచివర తియ్యటి పలుకుల పూతపూస్తూ.....
మనిషి!
విరిగిపోయిన రికార్డ్ ప్లేటుమీద
అరిగిపోయిన పిన్ను-
అరనిముషం నిశ్శబ్దoలో.....
అనేకానేక శబ్దాలు.
కసిని, కుళ్ళుని హెచ్చవేసి
అభిమానాన్ని, అనురాగాన్ని మైనస్ చేసి
మాయని, మోసాన్ని ప్లస్ చేస్తే-
దాని పేరు 'జీవితం' అని
తన నెత్తిన తనే కాళ్ళు పెట్టి,
తన చుట్టూ చక్కటి గోరి కట్టుకుంటూ.....
మనిషి!
తీగతెగిన వీణ మీద
సరిగమలు సాధన చేస్తూ
కలల వలల అంచులు పట్టుకు వ్రేళ్ళాడుతూ.....
మనిషి!
Comments
Post a Comment