మెరుపు....

నేను...నిరాహారదీక్ష చేయటం లేదు
నోట్లు లేనిదే నోట్లోకి వేళ్ళు ఎలా వెళతాయి?
అంతే......అంతే!
రాత్రిపూట మెరిసే రెండు కళ్ళు 
పోయ్యలోంచి బయంబయంగా చూస్తున్నాయి- నా వైపు.
ఇదో విచిత్రం -
నోరున్న మనుషులు నన్ను భయపెడుతుంటే 
నోరులేని జీవాలు నన్ను చూసి భయపడుతున్నాయి
నేను కళ్ళలో -
'నయాగరా'లు సృష్టిస్తున్నా!
నా మనో ఆకాశం నిండా మబ్బులు....
అప్పుడప్పుడూ - మబ్బుల్లో మెరుపులు
తళుక్కున కొత్త లోకాలు చూపుతున్నాయి!
ఒక్కక్షణమేఅయినా
నాకు  'మెరుపు' అంటే ఇష్టం-
అందుకే...
ఆ వెలుగునే శాశ్వతం చేసుకోవాలని ఆశ!

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........