కోలాహలం.....
చీకటి-
నడిచినంతమేర.
నిశ్శబ్దం-
వినబడినంతమేర.
నిశ్శబ్దాన్ని మింగేస్తూ-
ఓ నక్క కూత.....
ఏ గద్దె పైనుంచి?
జరా జరా వెన్నులో పాకిన ఫన్నగం-
భయం.
చైతన్యం ఒళ్ళు విరుచుకుంది
వివేకం వెన్ను తట్టింది-
ఈ చీకటి-
కంటిపైకప్పిన పరదా!
ఈ నిశ్శబ్దం-
కుత్తుకలోకూరేసుకున్నఆలోచనాతరంగం.
చీకటి పరదాలు చిల్చు-
జగత్తంతా వెలుగు పండుతుంది.
ఆలోచనామృతాన్ని అందరికీ పంచు-
అంతా కలకలం.......
కలలు పండిన కోలాహలం.
(తెలుగు సాహితీ సమాఖ్య, తాడేపల్లిగూడెం వారి 'మధుమంజరి'
వార్షిక సంచికలో ప్రచురితం)
నడిచినంతమేర.
నిశ్శబ్దం-
వినబడినంతమేర.
నిశ్శబ్దాన్ని మింగేస్తూ-
ఓ నక్క కూత.....
ఏ గద్దె పైనుంచి?
జరా జరా వెన్నులో పాకిన ఫన్నగం-
భయం.
చైతన్యం ఒళ్ళు విరుచుకుంది
వివేకం వెన్ను తట్టింది-
ఈ చీకటి-
కంటిపైకప్పిన పరదా!
ఈ నిశ్శబ్దం-
కుత్తుకలోకూరేసుకున్నఆలోచనాతరంగం.
చీకటి పరదాలు చిల్చు-
జగత్తంతా వెలుగు పండుతుంది.
ఆలోచనామృతాన్ని అందరికీ పంచు-
అంతా కలకలం.......
కలలు పండిన కోలాహలం.
(తెలుగు సాహితీ సమాఖ్య, తాడేపల్లిగూడెం వారి 'మధుమంజరి'
వార్షిక సంచికలో ప్రచురితం)
Comments
Post a Comment