ఈ నాటి సత్యాలు

ఆకాసంలో నక్షత్రాల మెరుపులు కావవి-
      బియ్యంలో రాళ్ల నలుపులు,
తొలకరి మబ్బుల జల్లులు కావవి-
      మండే గుండెల కన్నీళ్ళు.
ఉరిమే పిడుగుల శబ్దాలు కావవి-
       ఆకలి గుండెల ఆర్తనాదాలు.
శరత్కాలపు మంచుతెర కాదది-
        స్వార్ధపు కళ్ళకు పట్టిన పొర.
వసంత విరహిత మయూరీ నృత్యాలు కావవి-
        కలి ప్రళయ విలయ నృత్యాలు.
ప్రచండభానుని తీక్షణ వీక్షణలు కావవి-
         పేదల గుండెల్లో రగిలే జ్వాలలు.


పచ్చిమ గోదావరి జిల్లా 'అరసం' ద్వితీయ వార్షికోత్సవ సంచికలో ప్రచురితం.

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........