అద్దం

ఈ అద్దం చూడు తమ్ముడూ!
ఇంత మసగ్గా ఉందేమిటి?
అస్పష్టతా........అయోమయం.....
అంతా మసక మసక......!
తాతల తరాలనుంచి
వస్తున్న అద్దం కదాని-
ఇంకా, దాంట్లోనే చూచుకోటం.....
అబ్బే! అవివేకం....
చుక్కలూ, గీతలూ-
రూపానికీ, ప్రతిరూపానికి
ఎగుడు దిగుడులు-
ఇంకా, దాంట్లోనే చూసుకోటం
లాభం లేదు తమ్ముడూ!
అలా అని-
'అద్దం' బాలేదు కదాని
పగలేయ్యమనటం లేదు.
చెద పట్టిన చట్రాన్నితీసవతల పారెయ్!
ఎగుడు దిగుడుల కళాయి గీకేసి....
       "సమానంగా"
కొత్త కళాయి వెయ్యి!

SYMBOLISM  (ప్రతీకవాదం):    19 వ శతాబ్దపు ద్వితియార్డంలో ప్రెంచ్ కవులు 'మల్లార్కే, రింబాన్' లాంటి   వాళ్ళు ప్రతీకలనుఉద్దేశ్యపూర్వకంగా ప్రవేశపెట్టిన టెక్నిక్తో రూపం తీసుకుంది. ఈ ప్రతీకవాదంలోని  ఆద్యాత్మిక వాసనలు వదిలేసి  ప్రతీకల ద్వారా  జరిపే చమత్క్రుతులని "ఆరుద్ర"తన 'సినీవాలి, త్వమేవాహం' లలో స్వీకరించాడు.



(తెలుగు సాహితీసమాఖ్య, తాడేపల్లిగూడెం వారి 'మధుమంజరి' లో 
ప్రచురితం.)

Comments

Post a Comment

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........