నువ్వూ....నేనూ...

నా గుండెకు నువ్వు కావాలి........
నిన్ను పిలవమని గొంతుతో మంతనాలు.
భావాల్ని బయటపెట్టే భాషలేక
నీ మధుర స్మృతులతోనే ఆడుకుంటుంది

క్షితుజరేఖ దగ్గర
మనిద్దరం ఒక్కటైన అనుభూతి...
వానచినుకు ఎండకిరణం కలసి
ఆకాశం రెండంచుల్ని కలుపుతూ కట్టిన 
రంగుల వంతెనమీద
"రెహ్మాన్" సంగీతంతో...చిందులు వేద్దాం..
నేను నీ కనుపాపలో-
నీవు నా గుండెగుడిలో....
గాలి కబుర్లు వింటుంటాం...
కానీ, ఇంతలోనే
అనుభూతి దూరంగా జరిగి పోతుంది.
నేనొక్కడినే ఒంటరిగా
ఇక్కడ...ఈ గదిలో మిగిలిపోతాను.
అప్పుడు
నేనేవర్నని నన్నే అడుగుతాను.

నేను
నా రూపమే తెలియనివాడిని
మరి నువ్వో....
నా
పిచ్చి ఊహవి!

Comments

Popular posts from this blog

వెన్నెలకి వందనం

ఋతువులు

నీ కోసం.........